![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో.....నర్మద చందుకి సంబంధం తీసుకొని వస్తుంది. దాంతో అందరు అమ్మాయిని చూడడానికి వెళ్తారు. అక్కడ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఇష్టం అనుకుంటారు. అదే సమయంలో అమ్మాయి తండ్రికి ఫోన్ వస్తుంది. దాంతో తను మాట్లాడడానికి వెళ్తాడు. మరొకవైపు దీరజ్ దగ్గరకి ప్రేమ వచ్చి.. ఏం తింటావో చెప్పు అత్తయ్య వంట చేయమందని అడుగుతుంది. నేను ఏం తినను అంటూ దీరజ్ అంటాడు. నీకు ఒక విషయం తెలుసా.. భార్య చేసిన వంట తింటే భర్తలకి వాళ్ళపై ప్రేమ పుడుతుంది. అందుకే మీ నాన్న మీ అమ్మ చేసిన వంట తింటాడు కాబట్టి.. వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమ గా ఉంటారు.. అందుకే నేను వంట చేస్తానని ప్రేమ రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది.
దాంతో వద్దమ్మ నాకు నీ పై ప్రేమ వద్దు.. ఏం వద్దు నేను వండుకొని తింటానని కిచెన్ లోకి వెళ్లి ధీరజ్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. పక్కనే ప్రేమ ఉండి తనతో ఒక ఆట ఆడుకుంటుంది. మరొక వైపు అమ్మాయి తండ్రికి వేదవతి ఫోన్ చేసి.. మీకు వచ్చిన సంబంధం మంచిది కాదు. వాడు వాళ్ళ కొడుకుతో డబ్బున్న అమ్మాయిలని చూపించి అలా లేచిపోయాలా చేసాడు. అంతేకాదు వాడొక అనాధ.. ఊరు, పేరు లేదని అనగానే అమ్మాయి తండ్రి షాక్ అవుతాడు. మరొకవైపు ధీరజ్ చేసిన వంటని ప్రేమకి కూడా తీసుకొని వచ్చి తినమని చెప్తాడు. ఇద్దరు తింటుంటారు మళ్ళీ అక్కడ కూడా ప్రేమ ఏదో ఒకటి అంటూ ధీరజ్ కి కోపం తెప్పించడం చేస్తుంటుంది.
అమ్మాయి తండ్రి రామరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి.. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు అంటూ రామరాజుని అవమానిస్తాడు. మీకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాను కదా అని నర్మద అంటుంది. అయిన అతను అలాగే అంటుంటాడు. దాంతో అందరూ బాధపడతారు. సాగర్ నార్మద వంక కోపంగా చూస్తాడు. అందరు ఇంటికి బాధగా వస్తారు. నీకు గొప్ప సంబంధం తీసుకొని రాలేకపోతున్నానని చందు తో రామరాజు అంటూ బాధపడతాడు. ధీరజ్ కి అక్కడ జరిగింది తెలిసి బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |